హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల నేపథ్యంలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ్

VP: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు గాజువాక సీఐ వాసు నాయుడు ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో గొడవలు, ఘర్షణలు, బెదిరింపులు, అల్లర్లకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని సూచించారు. చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.