హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫినిషర్‌గా రాణించేందుకు సిద్ధంగా ఉన్నా: తిలక్

టీ20ల్లో మూడో స్థానం నుంచి ఐదు, ఆరో స్థానాల్లో వచ్చి బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ అన్నాడు. జట్టు అవసరాల కోసం ఫినిషర్‌గా రాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు. దేశం తరఫున ఆడుతూ మ్యాచ్‌లను ఫినిష్ చేయడం తనకు ఎంతో ఇష్టమని చెప్పాడు. నిరంతరం సాధన చేస్తూ ఏ స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించాడు.