హైదరాబాద్: 28°C
క్రీడలు

భార‌త్‌ను ఓడించినంత ప‌ని చేశాం: హోప్

వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయాలను ఎప్పుడు ట్రోఫీలతో లెక్కగట్టకూడదని అభిప్రాయపడ్డాడు. టీ20 సిరీస్‌లో సొంతగడ్డపై బలమైన జట్టుగా పేరున్న టీమిండియాను ఢీకొట్టామని తెలిపాడు. అయిదు టీ20ల సిరీస్‌ను 2-2తో సిరీస్‌ను సమం చేసి వారిని ఓడించినంత పని చేశామని పేర్కొన్నాడు. ఇది తమకు సిరీస్ గెలుపుతో సమానమని హోప్ వ్యాఖ్యానించాడు.