హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

రెస్టారెంట్లలో ఎక్కువ భోజనం చేస్తున్నారా..?

రెస్టారెంట్లలో తరచుగా తినడం వల్ల అవసరానికి మించి కేలరీలు శరీరంలోకి చేరుతాయి. అక్కడి పదార్థాలలో రుచి కోసం వాడే అధిక నూనెలు, నెయ్యి, ఉప్పు, పంచదార ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగిస్తాయి. క్రమంగా బరువు పెరగడం, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి బయటి తిండి తగ్గించి, ఇంటి వద్దే పరిశుభ్రంగా వండుకున్న పౌష్టికాహారం తినడం ఎంతో మంచిది.