హైదరాబాద్: 28°C
తెలంగాణ

తేలిగూడలో నెలకొన్న నీటి సమస్యకు పరిష్కారం

ASF: వాంకిడి మండలం తేలిగూడలో నెలకొన్న నీటి సమస్యను సర్పంచ్ బెండారే కృష్ణాజి పరిష్కరించారు. బోరింగ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడగా పంచాయతీ సిబ్బందితో ఆదివారం మరమ్మతులు చేయించారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు సర్పంచ్ తెలిపారు.ఉపసర్పంచ్ జాడే సంతోష్, వార్డు సభ్యులు లోహబడే ఉమేశ్, కార్పెత రామచందర్ తదితరులు పాల్గొన్నారు.