JGL: మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తండా చెరువు సమీపంలోని వ్యవసాయ బావిలో ఆదివారం మొసలి ప్రత్యక్షమై కలకలం రేపింది. పొలాలకు వెళ్తున్న రైతులు బావిలో మొసలిని చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో చెరువు నుండి బావిలోకి వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.
తెలంగాణ
బావిలో మొసలి ప్రత్యక్షం


