హైదరాబాద్: 28°C
తెలంగాణ

NHM ఉద్యోగుల పోరాటానికి మాజీ ఎమ్మెల్యే మద్దతు

NZB: NHM ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న పోరాటానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆదివారం మద్దతు ప్రకటించారు. ప్రజారోగ్య పరిరక్షణలో NHM ఉద్యోగుల పాత్ర కీలకమైనప్పటికీ, వారికి సరైన గుర్తింపు, ఉద్యోగ భద్రత లభించడం లేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలను గుర్తించి, వారి డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.