హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లకి సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే

RR: ఫరూక్‌నగర్ మండలం ఎలికట్ట భవాని మాత ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. అమ్మవారి ప్రత్యేక పూజల్లో భాగంగా నిర్వహించిన పల్లకి సేవను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎంపీపీ రవీందర్ యాదవ్ భుజాలపై మోశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలిసి ఈ సేవలో పాల్గొనడం స్థానికంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.