హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాసరలో భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు

NRML: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఎనిమిదో రోజు మహాగౌరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు చక్కెర పొంగలితో నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.