హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడే ఫైనల్ పోరు

ఆర్చర్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ చివరి అంకానికి చేరింది. ఇవాళ జరిగే మూడు మ్యాచ్‌లతో టోర్నీ ముగుస్తుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కాకతీయ నైట్స్, మైటీ మరాఠాస్ 'షార్ట్ కట్ డిసైడర్' మ్యాచులో తలపడతాయి. విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. ఓడిన జట్టు ఎలిమినేటర్-2లో పృథ్వీరాజ్ యోధాస్‌తో పోటీ పడుతుంది. గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.