హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్ర‌పంచ రికార్డు బ‌ద్ద‌లుకొట్టిన‌ భార‌త్‌, విండీస్

భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్ రన్‌రేట్ పరంగా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా 10.98 రన్‌రేట్‌తో పరుగులు రావడం విశేషం. గతంలో ఈ రికార్డు భారత్, న్యూజిలాండ్ టీ20 సిరీస్ (10.57) పేరిట ఉంది. తాజా రికార్డుతో ఇది రెండో స్థానానికి పడిపోయింది. కాగా.. భారత్, విండీస్ టీ20 సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.