హైదరాబాద్: 28°C
వ్యాపారం

సెంట్రల్ బ్యాంక్ లాభంలో 21% వృద్ధి

జూలై-సెప్టెంబరులో సెంట్రల్ బ్యాంక్ నికర లాభం 21 శాతం పెరిగి రూ.1,469 కోట్లకు చేరింది. ఇదే సమయంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.11,737 కోట్లకు పెరిగింది. వడ్డీ ఆదాయం రూ.8,743 కోట్ల నుంచి రూ.10,357 కోట్లకు ఎగబాకింది. స్థూల నిరర్థక ఆస్తులు 3.01% నుంచి 2.39 శాతానికి; నికర నిరర్థక ఆస్తులు 0.48% నుంచి 0.31 శాతానికి తగ్గాయి. కేటాయింపులు రూ.144 కోట్ల నుంచి రూ.490 కోట్లకు పెరిగాయి.