హైదరాబాద్: 28°C
వ్యాపారం

యాక్సిస్ బ్యాంక్ లాభం రూ.7,705 కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబరు త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ రూ.7,704.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంక్ నికర లాభం 37.6 శాతం పెరిగి రూ.7,003.28 కోట్లకు చేరింది. బ్యాంక్ నిర్వహణ లాభం 6 శాతం పెరిగి రూ.11,083 కోట్లుగా నమోదైంది. రుణాలు వార్షికంగా 23 శాతం, త్రైమాసికంగా 9 శాతం పెరిగి రూ.13,73,727 కోట్లకు చేరాయి.