హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌ రద్దు

వెస్టిండీస్, భారత్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమంగా ముగిసింది. వర్షం కురిసే సమయానికి భారత్ 7.4 ఓవర్లలో 5 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (30), శ్రేయస్ అయ్యర్ (22), నమన్ ధీర్ (24*) రాణించారు. విండీస్ బౌలర్లలో కీమో పాల్, షమర్‌ స్ప్రింగర్‌ చెరో రెండు వికెట్లు తీశారు.