హైదరాబాద్: 28°C
క్రీడలు

ఐపీఎల్ 2027 వేలం తేదీ ఖరారు..?

ఐపీఎల్ 2027 టోర్నమెంట్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న గోవా వేదికగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ పది జట్ల ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది. డిసెంబర్ 15న ప్రత్యేక బ్రీఫింగ్ ఉండనుందని తెలిపింది. గడిచిన మూడు సీజన్లలో విదేశాల్లో జరిగిన ఈ వేలం, ఈసారి మాత్రం మన దేశంలోనే జరగనుంది.