GNTR: తెనాలిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సుల్తానాబాద్లోని వడ్డెర కాలనీకి చెందిన రౌడీషీటర్ ఉప్పు రంగారావు ఇంటికి త్రీ టౌన్ సీఐ కాటూరి శ్రీనివాసరావు శనివారం రాత్రి వెళ్లి కౌన్సెలింగ్ నిర్వహించారు. అసాంఘిక కార్యకలాపాలకు, చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు.
వార్తలు
రౌడీషీటర్ ఇంటికి వెళ్లి పోలీసుల కౌన్సెలింగ్


