హైదరాబాద్: 28°C
క్రీడలు

IND vs WI : ఒకే ఓవర్‌లో 24 పరుగులు

WIతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే అభిషేక్ (6) వికెట్ కోల్పోగా, ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. షెపర్డ్ వేసిన రెండో ఓవర్‌లో 6, 2, 4, 6, 4, 1 బాది మొత్తం 24 పరుగులు రాబట్టాడు. ఇందులో ఒక సిక్సర్ స్టేడియం అవతల పడటం గమనార్హం. అయితే, భారీ షాట్‌కు యత్నించి 30 (10) పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇషాన్ పెవిలియన్ చేరాడు.