NTR: విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మను దర్శించుకోవడం తన అదృష్టమని అన్నారు. దేశమంతా చూసేలా విజయవాడ ఉత్సవ్‌ను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. విజయాలకు మార్గదర్శకంగా నిలిచే నగరం విజయవాడ అని కొనియాడారు. ఏపీ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కనకదుర్గమ్మను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ ఉత్సవ్‌లో సీఎం మోహన్ యాదవ్


