KNR: విత్తనోత్పత్తి బకాయిలు చెల్లించాలంటూ నేరేడుగొండ, కటాక్షపూర్ తదితర గ్రామాల సుమారు 70 మంది రైతులు శనివారం హుజూరాబాద్- వరంగల్ రోడ్డులోని ఈగల్ సీడ్స్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత రబీలో 300 ఎకరాల్లో మొక్కజొన్న, వరి విత్తనోత్పత్తి చేయగా ఏడాదిగా డబ్బులు ఇవ్వలేదన్నారు. యాజమాన్యం ఫోన్లో త్వరలో చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
తెలంగాణ
ఈగల్ సీడ్స్ ఆఫీస్ ముట్టడి


