హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయిపై పోలీసుల అవగాహన

ASR: కొయ్యూరు మండలంలోని చీడిపాలెంలో శనివారం సాయంత్రం సీఐ బీ.శ్రీనివాసరావు స్థానిక సంస్థల ఎన్నికలు, ఆపరేషన్ త్రిశూల్‌పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటర్లు ప్రలోభాలకు లోనుకాకుండా ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. గంజాయి అక్రమ రవాణాకు దూరంగా ఉండాలన్నారు.