KDP: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. పులివెందులలో సుమారు 500 మంది గుమిగూడి పోలీసులపై రాళ్లు రువ్వడంతో లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగించామని, గాలిలో కాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చామని వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద గుంపులుగా చేరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత


