హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు

MBNR: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జేఎల్‌బీ హరిప్రియ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, మహిళా ఉద్యోగినుల కోలాటాలు, సంప్రదాయ గీతాలతో కలెక్టరేట్ ప్రాంగణం మారుమోగింది.