హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల ఫిర్యాదులపై నిరంతర పర్యవేక్షణ చేస్తాం'

తూ.గో జిల్లా కలెక్టరేట్‌లో ఎన్నికల కంట్రోల్ రూమ్ సిబ్బందితో ఆర్డీవో ఎస్. భాస్కర్ రెడ్డి శనివారం సమావేశమై విధుల నిర్వహణపై సూచనలు చేశారు. కంట్రోల్ రూమ్ 24 గంటల పాటు పనిచేస్తుందని, సిబ్బంది షిఫ్టుల వారీగా అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేసి నిర్దేశిత గడువులోగా పరిష్కారమయ్యేలా పర్యవేక్షించాలని సూచించారు.