హైదరాబాద్: 28°C
తెలంగాణ

విషాదం.. గుండెపోటుతో డ్రైవర్ మృతి

WGL: వరంగల్ నగరంలోని ఉర్సు గుట్ట వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్‌కు గుండెపోటు రావడంతో టాటా ఏస్ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. గమనించిన స్థానికులు డ్రైవర్‌ను వాహనం నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.