హైదరాబాద్: 28°C
తెలంగాణ

7 వేల పోస్టులేనా? 25 వేలకు పెంచాలి

HYD: హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన పోలీస్ ఉద్యోగార్థులు తమ ప్రాంతాలకు కానిస్టేబుల్ పోస్టులు కేటాయించాలని హరీశ్ రావుకు వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో 25 వేల పోలీస్ పోస్టులు ఖాళీగా ఉండగా, కేవలం 7 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడంపై ఆయన స్పందించారు. ఖాళీలకు అనుగుణంగా నోటిఫికేషన్ల సంఖ్యను 25 వేలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.