హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిత్రుని కుటుంబానికి రూ.20 వేల సాయం

BHPL: టేకుమట్ల మండలం వెలిశాల జెడ్పీహెచ్ఎస్‌లో 2003-04 బ్యాచ్‌కు చెందిన అచ్చే సతీశ్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి తోటి స్నేహితులు అండగా నిలిచారు. కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం కల్పించడంతో పాటు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్న మిత్రులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.