కోనసీమ: రావులపాలెం కేఎస్ఆర్ కాంప్లెక్స్లో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవారు రూ.కోటి నగదుతో అలంకరించిన శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కాంప్లెక్స్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
కోటి రూపాయలతో అమ్మవారికి అలంకరణ


