హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. కొత్తచెరువులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వద్ద భద్రత, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరగాలని సూచించారు.