హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగులాంబ ఆలయంలో ప్రత్యేక పూజలు

GDWL: ఐదో శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ అమ్మవారు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శనివారం రాత్రి కాళరాత్రి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో భక్తిభావ వాతావరణం నెలకొంది.