హైదరాబాద్: 28°C
తెలంగాణ

దసరా వేళ కొడంగల్‌కు సీఎం

VKB: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 22న కొడంగల్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి పండుగ శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా అభివృద్ధి పనులపై ఏవైనా ప్రకటనలు చేస్తారా అన్నది ఉత్కంఠగా మారింది.