హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ

కోనసీమ: అమలాపురం మండలం కామనగరువు విత్తనాల కాలువ గట్టు వద్ద శనివారం టిప్పర్ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో స్తంభం విరిగిపోవడంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఘటనపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆరోపిస్తున్నారు. విరిగిపోయిన విద్యుత్ స్తంభం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.