హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేసిన బోథ్ MLA

ADB: తాంసి మండలంలోని వడ్డాది గ్రామంలో బతుకమ్మ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బోథ్ MLA అనిల్ జాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. తెలంగాణ సంస్కృతిలో బతుకమ్మకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రజలందరూ కలిసిమెలిసి పండుగలను నిర్వహించుకోవాలని MLA అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు.