హైదరాబాద్: 28°C
తెలంగాణ

పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలి

SRPT: తిరుమలగిరి మండలం తొండ, తాటిపాముల గ్రామాల్లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా CI డి. నాగేశ్వరరావు, తిరుమలగిరి SI జి. వెంకట్ రెడ్డి ఈరోజు శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించారు. పండుగలను సోదరభావంతో జరుపుకోవాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని వారు సూచించారు. సమస్యలు తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.