MBNR: జడ్చర్లలోని వేద 9 రెస్టారెంట్లో చికెన్ కర్రీ తిన్న ఓ కస్టమర్కు 15 నిమిషాల్లో దద్దుర్లు రావడంతో ఫిర్యాదు అందింది. దీంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ శ్రీలత శనివారం తనిఖీలు నిర్వహించగా, వంటగది అపరిశుభ్రత, ఎక్కువకాలం నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఈ నెల 31లోగా లోపాలు సరిదిద్దుకోకపోతే లైసెన్స్ రద్దు చేసి, హోటల్ను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు


