ASF: సిర్పూర్ (టి) మండలంలో TGSEWRS జూనియర్ కళాశాల ప్రారంభించాలని శనివారం పూర్వ విద్యార్థులు MROకు వినతిపత్రం అందజేశారు. నూతన భవనం, తరగతి గదులు, ల్యాబ్లు, లైబ్రరీ సౌకర్యాలు కల్పించాలని కోరారు. సమస్యను 20 రోజుల్లో పరిష్కరించేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని ఎంఆర్వో హామీ ఇచ్చారు. హామీ నెరవేరకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.
తెలంగాణ
TGSEWRS జూనియర్ కళాశాల ప్రారంభించాలని వినతి


