NZB: జిల్లా రవాణా శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు హోంగార్డులను మాతృశాఖకు సరెండర్ చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ దుర్గాప్రమీల తెలిపారు. RTA ఆర్మూర్ యూనిట్లో పనిచేస్తున్న దశరథ్, ఉమ్మడి జిల్లా మొబైల్ స్క్వాడ్లో విధులు నిర్వహిస్తున్న భాస్కర్పై అవినీతి ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
రవాణాశాఖ నుంచి ఇద్దరు హోంగార్డుల సరెండర్


