హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో రోజు నామినేషన్ల జోరు

VSP: జీవీఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణలో రెండో రోజైన శనివారం మేయర్ పదవికి 7, వార్డు సభ్యుల పోటీకి 265 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ పదవికి వైసీపీ నుంచి వరుదు కళ్యాణి, బీఎస్పీ నుంచి కరణం కీర్తన గ్రేస్, ఇతర పార్టీలు, స్వతంత్రులు నామినేషన్లు వేశారు. వార్డు అభ్యర్థులకు సంబంధించి రెండు రోజుల్లో కలిపి మొత్తం 331 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు.