హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ

SDPT: బెజ్జంకి మండలంలోని గూడెం బస్టాండ్ ప్రాంతంలో మహిళ మెడలోని పుస్తెల తాడును బైక్‌పై వచ్చిన వ్యక్తి లాక్కొని పారిపోతుండగా స్థానికులు పట్టుకున్నారు. గూడెం గ్రామానికి చెందిన జంగిటి మమత వ్యవసాయ క్షేత్రానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఆమె కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు నిందితుడిని పట్టుకుని బెజ్జంకి పోలీసులకు అప్పగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.