హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.6.11 లక్షల నోట్లతో ధనలక్ష్మిగా రేణుక ఎల్లమ్మ

KMR: శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో దేవీ నవరాత్రుల సందర్భంగా అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ బుర్ర నారా గౌడ్‌, గౌడ సంఘం అధ్యక్షుడు తాడూరి గోపి గౌడ్‌ ఆధ్వర్యంలో రూ.6.11 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. నోట్లతో హంసలు, గజరాజుల నమూనాలు రూపొందించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు.