VZM: చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీలోకి భారీ చేరికలు జరిగాయి. శనివారం మెరకముడిదాం మండలం జి.మర్రివలస గ్రామానికి చెందిన నేరళ్ల నారాయణరావు ఆధ్వర్యంలో 200 కుటుంబాలు ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు సమక్షంలో టీడీపీలో చేరాయి. చంద్రబాబు పాలనకు ఆకర్షితులై చేరామని నేతలు తెలిపారు. పార్టీ కోసం కృషి చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చీపురుపల్లిలో టీడీపీలోకి భారీ చేరికలు


