JGL: పాత్రికేయులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముక్కెర చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి ఆకుల మల్లికార్జున్ అన్నారు. సిరిసిల్ల జిల్లాలో పాత్రికేయుల పట్ల పోలీసుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ శనివారం ఆర్డీవో జీవాకర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.
తెలంగాణ
'పాత్రికేయులపై దాడులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం'


