హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

MDK: పాపన్నపేట మండలం ఏడుపాయల దేవస్థానం గోకుల్ షెడ్‌లో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం సాయంత్రం ప్రధాన అర్చకుడు శంకర్ శర్మ ఆధ్వర్యంలో రుత్వికులు అమ్మవారికి లలితా త్రిపురసుందరి (కాళరాత్రి) అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.