హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ

NLR: రాపూరు మండల నూతన ఎంపీడీవోగా గండవరపు వెంకటేశ్వర్లు శనివారం బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న జీ. వెంకటేశ్వర్లు రాపూరు మండలానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. మండల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు చేస్తానన్నారు.