హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలోకి భారీ చేరికలు

NLR: టీడీపీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరికలు జోరందుకున్నాయి. అల్లూరు మండలం పురిణి గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు పసుపులేటి సుధాకర్ ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు శనివారం టీడీపీలో చేరాయి. వారికి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.