WGL: వర్ధన్నపేట పట్టణంలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని పూజా కార్యక్రమంలో శనివారం ఎమ్మెల్యే నాగరాజు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలు అందించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి పాల్గొన్నారు.
తెలంగాణ
దుర్గాభవాని పూజలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు


