హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీక: కలెక్టర్

BDK: బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన వెన్నముద్దల బతుకమ్మ వేడుకలో పాల్గొన్న ఆయన, ప్రకృతి, పూలు, మహిళల గొప్పతనాన్ని చాటే పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. భావితరాలకు మన సంప్రదాయాలను అందించడంలో ఇటువంటి వేడుకలు కీలకమన్నారు.