హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

BDK: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాల్వంచ కేటీపీఎస్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృతి చెందినట్లు సమాచారం. మృతులు కొత్తగూడెం పట్టణంలోని రామవరం ప్రాంతానికి చెందినవారిగా స్థానికులు గుర్తించారు. ఈ ఘటనతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.