NLG: త్రిపురారం మండల కేంద్రం రైతు వేదికలో శనివారం ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి 51 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఆడపిల్లల వివాహాల సమయంలో తల్లిదండ్రులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
తెలంగాణ
లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ


