KMM: దసరా నవరాత్రుల ఏడో రోజు సందర్భంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీల్చర్వులోని కనకదుర్గ మండపంలో అమ్మవారిని రూ.12 లక్షల కరెన్సీ నోట్లతో అలంకరించారు. శ్రీరామ భజన భక్త మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి అలంకరణను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
తెలంగాణ
కరెన్సీ నోట్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ


