హైదరాబాద్: 28°C
తెలంగాణ

గునుగు పూలకు భారీ డిమాండ్

NZB: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ నేపథ్యంలో నిజామాబాద్ నగరంలో గునుగు పూలకు భారీ డిమాండ్ నెలకొంది. బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించి పూజించేందుకు మహిళలు గునుగు పూలను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దీంతో పూల మార్కెట్లు, రహదారుల పక్కన ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాలు సందడిగా మారాయి.